Aug 31, 2011

గరం గరం చాయ్... షుగర్ ఎక్కువైంది...

...

నేను, మా మామ ఓ రోజు అమీర్ పేట్ కి వెళ్ళాం. వెళ్ళిన పని అయిపొయింది....అలవాటుగా ఇరాని హోటల్ కి వెళ్లి చాయ్ తాగుతున్నాం....ఇంతలో నా కళ్ళు అప్పుడే టీ కౌంటర్ లో టీ తీస్కుంటున్న ఒక రోజు కూలి మీద పడ్డాయ్....

ఒక పక్కగా  గోడకు ఆని నిల్చున్నాడు.....వాడి నిలువు సగం వైపు మాత్రమే కనిపించేలా ఒక వైపు తిరిగి....చాలా స్టైల్ గా నిలబడ్డాడు కౌంటర్ దగ్గర.... బట్టలు మాసిపోయి.. జుట్టంతా చిందర వందరగా..డొక్కు మొహం వాడూను....ఎందుకో అంత స్టైల్ వాడికి......

ఇంతలో వాడు నన్ను చూసాడు... వాడు అలా స్టైల్ గా నిల్చోవడం నేను గమనించాను అని వాడికి తెలిసిపోయింది....నా వైపు కాసేపు అలాగే చూసాడు.......నేను వాడికేసి అలాగే చూస్తున్నా.....

నాకేం తక్కువా నేను స్టైల్ గా ఉండకూడదా అన్నట్టుగా మాటి మాటికి...నేను వాడి వైపు చూస్తున్నాన లేదా అన్నట్టుగా నా వైపే చూస్తున్నాడు......

వాడి టీ రానే వచ్చింది..... ఎడమ చేత్తో దాని తీస్కొని....వాడు నిల్చొన్న ఫోసులో నుండి కదలకుండా టీ తాగుతున్నాడు......

నాకు మండిపోయింది..... అందరిలా కూర్చొని తాగొచ్చుగా....వీడు బహుశా స్పెషల్ కూలి ఏమో ఇక్కడ అనుకున్నాను....

మా టీ తాగడం అయిపొయింది....మా మామ దమ్ము కొట్టడం స్టార్ట్ చేసాడు.....

వాడు కూడా తాగేసాడు....నేనింకా వాడి వైపే చూస్తున్నాన లేదా....అన్నట్టుగా ఇంకో చూపు చూసి, బయటకు కదిలాడు....పూర్తిగా నా వైపు తిరిగాడు.....

“ ఛ!! ఎంత దారుణం.... కాసేపు ఎంత చండాలంగా ఆలోచించాను....తప్పుగా అనుకున్నాను..” నాలో నన్ను తిట్టుకున్నాను......

పాపం! వాడికి ఒక చెయ్యి లేదు.........

మనం చూసిందే ఎప్పుడూ నిజం అనుకోకూడదు.....

No comments:

Post a Comment