Showing posts with label వ్యథలు. Show all posts
Showing posts with label వ్యథలు. Show all posts

Nov 16, 2011


నేను శపించబడ్డాను....



నిశాంధకారపు మనః పాతాళంలో, ఆరని జ్వాలలకు ఆహుతి కమ్మని....

నేను శపించబడ్డాను....

తీరం తెలియని కెరటాల కోరల్లో మునిగిపొమ్మని.......

నేను శపించబడ్డాను......

కాలం వెలివేసిన కీకారణ్యపు నిశబ్దం లో గొంతు చించుకు అరవమని....

నేను శపించబడ్డాను......

దారులు కమ్మేసిన కోరికల ఎడారిలో ఎండిపోమ్మని......

నేను శపించబడ్డాను......

ఆశల అగాథం లో కాలం వేసిన కాటుకు బలికమ్మని....

నేను శపించబడ్డాను......

Jul 27, 2011

మావయ్య కథ – 1



మా మావయ్య నా బద్ధకం గురించి ఎప్పుడూ చెప్పే కథ ఇది.....

ఒక ఊరిలో ఇద్దరు బద్దకస్తులు ఉండే వాళ్ళు.... వాళ్ళు ఒక సారి ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.....తప్పనిసరి పరిస్థితి లో బయలుదేరారు.....

దారి మద్య లో.. అలసట రాక ముందే.....  ఎక్కడ అలసట వచ్చేస్తుందో అని వాళ్ళిద్దరూ అక్కడ కనపడిన ఒక రేగు చెట్టు కింద పడుకున్నారు....

కాసేపటికి అందులో ఒకడికి.....దూరంగా కట్టెల మోపు మోసుకుని వెళ్తున్న ఒక ముసలి వాడు కనిపించాడు, ఆ ముసలి వాడిని చూసి..”ఓ! తాతా...!  ఒకసారి ఇటు రా....” అని గట్టిగా అరిచాడు...

ముసలివాడు వాళ్ళను చూసి.... ఎందుకు పిలుస్తున్నారో తెలియక ముందుకు సాగిపోయాడు....

ఈ సారి ఇంకా గట్టిగా “ఓ! తాతా ...! తొందరగా ఇటు రావయ్య.....” అని అరిచాడు...

ఆ పిలుపుకి కంగారు పడ్డ ముసలివాడు...వాళ్లకు ఏదో అయ్యింది అనుకొని కట్టెల మోపు అక్కడే పడేసి, వాళ్ళ దగ్గరకి పరుగెత్తుకు వచ్చాడు...

“ఏమైంది నాయన....! ఏమైంది...???” అని అడిగాడు ముసలివాడు...

“ఆ పక్కన ఓ రేగు పండు పడింది...తీసి నోట్లో పెట్టావా!” అన్నాడు మొదటివాడు....

దాంతో చిర్రెత్తిపోయిన తాత....వాణ్ని కొట్టడం మొదలెట్టాడు......

ఇంతలో రెండోవాడు....
  కొట్టు! బాగా కొట్టు వెధవని!....అప్పటి నుండి ఈ కుక్క నా మూతి నాకుతుంటే కనీసం దూరంగా కొట్టట్లేదు..!!!!”