ఎండాకాలం వచ్చిందంటే ఎంత హాప్పి నో అసలు...అమ్మమ్మ వాళ్ళింటికెల్లొచ్చు...హాయిగ సత్తి మామ ఉంటాడు,అంబిక అక్క ఉంటుంది..బర్రెలు..కోళ్ళు..జామ చెట్టు. ఎంచక్క అడిగే వాళ్ళు ఉండరు, సూపరుగ ఆడుకోవచ్చు..సారీ!! మనం చాలా బద్దకస్తులం కదా..నొ ఆడుకోవడం.. ఒన్లీ పడుకోవడం.
పొద్దునే బర్రెల పేడ కంపు తొ ఉదయం... కాదు..సూర్యుడు ఉదయించక ముందే రోజు స్టార్ట్ అవుతుంది.
అప్పుడే బర్లు వాటి వాటి మల మూత్ర విసర్జన కార్యక్రమాలు స్టార్ట్ చెస్తాయ్.. సత్తి మామ లేచి పాలు పితకడం,అమ్మమ్మ,అంబికక్క హెల్ప్ చేయడం....ఇది రొజూ వారి పని. మామ 5:30 కల్లా గొదవరిఖని కి వెల్లిపొయేవాడు.కొంచెం తెల్లవారగానే..ఇల్లు ఊడ్వడం,అలకడం స్టార్ట్ అవుతుంది..లేచి ఇక్కడ మంచాలు అక్కడ వెస్కొని మళ్ళీ తొంగోవడం అంతె..7 కి బర్లని మేపడానికి తోలతారు.. మనం మాత్రం దున్నపోతుల 9 కి లేచి బద్దకంగా పళ్ళు తొమేసరికి..అమ్మమ్మ చాయ్ వేడి చేసి కోప్ లొ పోసి ఇచ్చేది.. మనం తాగిన గ్లాస్ ఎక్కడ కూర్చుంటె అక్కడె పెట్టేసి.. జామ చెట్టు ఎక్కేసె వాళ్ళం..
ఇక స్టార్ట్ మా తాత గోల... దింగండిరా!!!!! అని... మనం ఎందుకు దిగుతాం...నాతొ పాటు మన గాంగ్ చెల్లి,అక్క,అన్న,తమ్ముల్లు(పెద్దమ్మ వాల్ల పిల్లలతొ సహా).. సపరివారం అంతా.. లేచిన వాడు లేచినట్టు గా.. జామ చెట్టు ఎక్కేయడమె....బ్రేక్‌ఫాస్ట్ మొదలు అయ్యేది అక్కడే... మొహం మొత్తాక కిందికి దిగడం... ఈలొపు వంట-వార్పు కార్యక్రమాలు ఎమన్నా జరిగితే మళ్ళి ఒక రౌండ్ కుమ్మడం.. లేకుంటె తినమని అమ్మమ్మ,తాత దొబ్బే వాళ్ళు..ఎప్పుడు కడుపు కదిలితే అప్పుడు అలా కాల్వ గట్టుకు పోయి...పని ముగించేసి... అక్కడే కాసేపు టైంపాస్ చేసి.. వీలుంటె నీళ్ళలొ దిగి.. ఆడి.... అలసి పొయాక మద్యాన్నం నిద్ర కోసం ఇంటికి వచ్చె వాడిని..ఈలొపు మామ రిటర్న్ అవుతాడు.. అందరు మామ సైకిల్ దగ్గరికి పరుగో పరుగు..మామ గొదవరిఖని నుండి ఎమన్నా తెచ్చాడొ చూసి..ఉంటే కుమ్మేసి..పాల క్యాన్ లు కడగడం స్టార్ట్ చేస్తారు.. . బర్లను మేపడానికి పని వాడిని పెట్టుకోక ముందు మామ మేపడానికి వెళ్ళెవాడు... అప్పుడప్పుడు వాయిల్ కొమ్మలు విరిచుకొని మేము కూడ పొలోమని బయల్దేరెవాళ్ళం..నడవలేక పోతె నన్ను అన్నని చెరొక బర్రె మీద కుర్చోబెట్టె వాడు మా మమ.. ఆ ఎండకు బరించలేక మద్యలోనె రిటర్న్ అయ్యే వాళ్ళం..మామ వచ్చేటప్పుడు ఈత కాయలు పట్టుకొచ్చే వాడు...మద్యాన్నం టీవి చూసే వాళ్ళం కాసేపు...ఒక సారి అది రిపేర్ కి వచ్చింది.. మా అన్న కి కాస్త రిపేరింగ్ లొ ప్రావిణ్యం ఉండటం చేత దాన్ని విప్పాడు.. తర్వాత తెల్సింది, మా అన్న కి బిగించడం రాదు అని.... దానితొ అప్పుడప్పుడు చూసే జంగిల్ బుక్, శక్తిమాన్ కి దూరం అయ్యాం... మాకో అక్షయ వృక్షం లాంటి నిమ్మ చెట్టు ఉండేది... ఎన్ని కాయలు తెంపినా ఇంకా చాలా ఉండేవి... ఊర్లొ అందరు వచ్చి తెంపుకు పొయే వాళ్ళు.. మేము మద్యాన్నం షర్బత్ చెస్కునే వాళ్ళం...షర్బత్ చెసెప్పుడు మాత్రం పార్టీలు పెట్టే వాళ్ళం...ఒక పార్టి వాళ్ళు నాలుగు నిమ్మ కాయలు కోస్తె మరో పార్టి వాళ్ళు అయిదు కోసేవారు.. చక్కర కొసం పొట్లాట జరిగేది.. మా మామ పాలు అమ్మితె వచ్చే సగం డబ్బులు చక్కరకె అయ్యెది..
అరుగు మీది గుమ్మి లొ కొడి గుడ్లు పెట్టేది...అది గుడ్డు పెట్టె అప్పుడు నానా రచ్చ సౌండ్ చెసేది... మాకు నిద్ర డిస్టర్బ్ అయ్యేది...
మా పిల్ల గ్యాంగ్ అంత ఒక సారి ఆస్థి పంపకాలు చేస్కున్నాం.. అందులొ మొదటిది జామ చెట్టు...
ఒక్కో కొమ్మ ఒక్కొక్కరం పంచుకున్నాం
మొదటి నిబందన... ఎవరూ ఇష్టం వచ్చినట్టు కాయలు కోయాకుడదు..
రెండవ నిబందన.. ఎవరి కొమ్మ కాయలు వాళ్ళె కొసుకొవాలి,వేరె కొమ్మల జొలికి వెళ్ళ కుడదు..వాళ్ళ కొమ్మకు కాయలు అయిపొయిన సరే...
మూడవ నిబందన...ఎవరైతె నిబందనలని అతిక్రమిస్తారొ వాళ్ళ కొమ్మల కాయల్ని ఎవరైన కొసుకోవచ్చు..
నాలుగవ నిబందన.. పందిరి వైపు వాలి ఉన్న కాయలు పబ్లిక్ ప్రాపర్టి....
చాల రొజులు ఈ నిబందనలు బాగనే వర్కౌట్ అయ్యాయ్...
ఆ కొమ్మల పైనే ఆటలాడడం.. మా కొమ్మల కాయలను పరస్పరం ఇచ్చి పుచ్చుకొవడం.. అబ్బబ్బ.. పూర్వం ఆది మానవులు చెట్ల మీద నివసించే వారు అంటే మాకు ఎ మాత్రం సందేహం రాక పోయేది...మేము ఆ కొమ్మల్లొ నిద్ర కూడా పోయె వాళ్ళం...
చక్కగా సాగుతున్న మా చెట్టు కాపురం లో విలన్లు కూడా ఉన్నారు....
విలన్1: చిలకలు
విలన్2: పచ్చ పాము(నాట్ డేంజరస్)
సాయంత్రం అవగానే చిలకలు మా చెట్టు మీద దాడి చేసెవి.. ఇష్టం వచినట్టు తినెసేవి..చాల వరకు కొరికి పడేసేవి..
ఇక పచ్చ పాము..దీనికి ఏం పని ఉండేది కాదు...ఊరంత బలాదూర్ తిరిగి ఎప్పుడు రెస్ట్ కావాలి అనుకుంటె అప్పుడు మా చెట్టు మీదికే వచ్చేది... అది వస్తుంది అని తెలిస్తేనె మాకు లాగులొ...
సర్రున కిందికి దిగి పోయెవాళ్ళం.. అది ఎప్పుడు వెళ్తుందా అని చూసి చూసి కళ్ళు జామ కాయలు కాసేవి...అది ఎంతకు వెళ్ళేది కాదు
విలన్3: కొన్ని రొజులకి చిలకల గోల ఎక్కువైంది.. కొన్ని కాయలు మాత్రమే కొరికి పెట్టెవి.. సరిగ్గా ఏ కాయ అయితె బాగుంటుందొ దాన్ని మాత్రమే కొరికి పెట్టేవి.. అది పండయ్యక తిందాం అన్న మా కొరిక బగ్నం చేసేవి.. ఇలా చాల సార్లు జరిగింది.. ఎ కాయైతె బాగుంటుందో..ఎ కాయైతె పండయ్యాక మేము తిందాం అని చూస్తమో కరెక్ట్ గా అదే కాయను కొరికేవి.. ఎంతకి అంతు పట్టని విషయం ఎంటంటె..కరెక్ట్ గా అవే కాయల్ని అవి ఎలా కొరికి పెదుతున్నాయి అని... ఎలాగైన ఈ మిస్టరీని చేదించాలి అనుకొని..ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసాం.... చాల రొజులు కృషి చేసి సాధించాం..
మా చెల్లి..మేము ఎక్కడ తినెస్తామో అని అది కాయగ ఉన్నప్పుడె కొరికి పెట్టేది...అదేంటొ మా చెల్లి లొని తెలివితేటలు అప్పుడే బయట పడ్డాయ్...అది అప్పుడే గుర్తించి కూడ ఇంక మేము తన డిప్లమాకి డబ్బులు కడుతూనె ఉన్నాం...తను ఎక్సాంస్ రాస్తూనె ఉంది..
సాయంత్రం అవగానే మళ్ళి బర్ల గోల స్టార్ట్ అవుతుంది.. అవి రాగానె దానా కోసం ఇంట్లొ చొరబడేవి...మా గ్యాంగ్ లొ ఇంటి ముందు గుమ్మానికి ఒకడు..వెనక గుమ్మానికి ఒకడు కాపలాగా ఉండేవాళ్ళం..ఇక మొదలు అవుతుంది అసలు స్టొరీ...నీళ్ళు చేదడం... వాటికి కుడిది పెట్టడం...అబ్బొ..! అవి కుడిది తాగుతుంటె వచ్చె సౌండ్..న భూతే న భవిష్యత్!!పాతాళం లోని గంగ ని అర్జునుడు లాగినప్పుడు కూడా అంత సౌండ్ రాలేదేమో..అలా ఒక్కొక్కటిగ అన్నింటిని కవర్ చెసేసి...కొంచెం చీకటి అవగానే మళ్ళీ పాలు పితకడం స్టార్ట్ చేస్తారు...
అప్పుడే పితికిన పాలల్లొ.. ఒక గ్లాసెడు చెక్కర వేసుకొని(కరక్టె.. మేము గ్లాసెడు పాలకి గ్లాసెడు చెక్కర వేసే వాళ్ళం) తాగేవాళ్ళం.
రాత్రి తినక ముందే అందరు నిద్ర మొఖాలు వేసేవాళ్ళు... ఎవడు ముందు డిన్నర్ కి వస్తే వాడికి కొడి గుడ్డు పళ్ళెం దక్కుతుంది.. దాన్ని అందరు స్పెషల్ గా బావించేవాళ్ళు ..తినేటప్పుడు దోమలతో అగచాట్లు...మేము అన్నం తింటుంటే అవి మమ్ముల్ని తినేవి...ఈ మధ్యలొ మాతొ పని లేదన్నట్టుగా.. మనం మార్నింగ్ టైం లో చేసే పనులన్నీ మా బర్రె రాజములు కానిస్తూ ఉండేవి.. ఆ సౌండ్ లేమి పట్టించుకోకుండ మా బొజనం మేము కానిచ్చేవాళ్ళం...మా జనాభా ఎక్కువ.. మంచాలు తక్కువ.. మళ్ళీ అదే తంతు.. ఎవడైతె ముందు నిద్రకు పోతాడొ వాడికి మంచం దొరుకుతుంది.
మా వాకిలి నిండా బర్రెలే కాబట్టి, సాయమ్మ వాళ్ళ వేప చెట్టు కింద పడుకునేది... చుక్కలు లెక్క పెడుతూ మేఘాల చాటుకు దాక్కున్న చంద్రున్ని చూస్తూ.. మా సత్తి మామ సుత్తి వింటూ...అలా నిద్ర లోకి జారుకునేది..
రొజులో అలా ఒక సారి పిన్ని వాళ్ళ చింత చెట్టు మీద కూడ దాడి చెసేవాళ్ళం...అక్కడైతె తాత ఉండడు.. ఓది మామ ఉండడు..మేము ఎంత అల్లరి చేసినా మా పిన్ని బిసి లొ పిన్ని ఉండేది.. ఇల్లెక్కి పెంకులు విరగొట్టె వాళ్ళం..ఇవి చాలక పక్క వాళ్ళ చింత కాయలు కూడ రాల గొట్టే వాళ్ళం.. పిన్ని వాళ్ళకో పెద్ద రేగు చెట్టు కూడా ఉండేది..కాయలు మాత్రం కాయక పోయేది...ఇలా మా రొజులు నిమిషాల్ల గడిచి పొయేవి....సెలవులు అయిపొయేవి.. అమ్మమ్మ వాల్లిల్లు వదిలి వెళ్ళాలంటె ఏడుపు వచ్చేది.. అప్పుడప్పుడు ఎడుస్తూనె వెళ్లే వాళ్ళం.. మళ్ళీ దసరా కి వచ్చేస్తాం కదా...

maa ammamma vaalla ooru Bacharam.....aa pata rojulu gurtuku vachayi mee tapa valla.....tanx but ippati taram ilanti madhura smrutulani pondaleka potunnaru...
ReplyDeleteee taram vallaki techno schools,mobiles,computers thone saripothundi.. nature ni, memories enjoy chese time vallakekkadidi
Delete