అప్పుడు నేను చాల చిన్నవాడిని..... ఒకటో తరగతి అనుకుంటా..
అది ఒకానొక ఆగష్టు 15, మా స్కూల్లో ఆటల పోటీలు పెట్టడం అదే మొదటి సారి......చాల మంది ఉత్సాహంగా పాల్గొనడం మొదలు పెట్టారు...... మేము చాల చిన్న వాళ్ళం కాబట్టి మాకు ఏ ఆట ఎలా ఆడాలో తెలియదు...ఇదే ముక్క మా మాష్టారు గారికి విన్నవించాం.....ఆయన గారు మమ్ముల్ని అందర్ని పిలిచి ఒక గ్రూపు గా చేసారు.... నాలుగవ తరగతి పిల్లల్ని పిలిచి వాళ్ళని ఇంకో గ్రూపుగా చేసి.... మా గ్రూపు లో ఒకడికి ఆట ఎం చేయాలో చెప్పి......అవతలి గ్రూపు తో ఆడమన్నాడు......
వీడు “కబడ్డీ... కబడ్డీ.....” అంటూ వెళ్ళాడు ...... వీడు వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ వీణ్ణి పట్టుకునేసారు..........
“ అర్దమైందా......” అని అడిగారు మాష్టారు......అందరికి ఏమో గాని...నాకు మాత్రం మొత్తం అర్ధమై పోయింది.....ఇంతేనా కబడ్డీ అంటే.....ఇక కబడ్డీ లో మనమే రారాజు.....మనల్ని మించిన వాడు లేడు.....
“అరేయ్ నువ్వు వెళ్ళరా .......” అన్నాడు మాష్టారు నన్ను చూపిస్తూ........
సింహం జూలు విదిల్చింది......”కబడ్డీ.... కబడ్డీ......” .....
“కబడ్డీ......” అంటూ వెళ్లి అందులో ఒకడిని గట్టిగా పట్టుకున్న.......
అందరు ఒక్కసారిగా నవ్వారు......ఎందుకో నాకర్ధం కాలేదు....ఇంతకు ముందు వాడు వెళ్ళినపుడు కూడా అంతేగా.......అందరు కలిసి ఒక్కడిని పట్టుకున్నారు...... ఇప్పుడు నేను ఒకన్ని పట్టుకున్నాను...... వీళ్ళకు అసలు ఆటే రాదు..
ఎలాగైతేనేం..... మా తరగతి వాళ్ళకి కబడ్డీ పోటీలు జరగలేదు.....మరుసటి రోజు......పరుగు పందేలు..
తరగతి మొత్తాన్ని పిలిచి.....దూరంగా ఇద్దరు లాగి పట్టుకున్న ఒక తాడును చూపిస్తూ ...”దాన్ని ఎవరైతే ముట్టుకొని....మల్లి ఈ చివరకు మొదట చేరుకుంటారో....వాళ్ళు గెలిచినట్టు.....ఈల వేసేదాక ఎవరూ పరిగెత్త కూడదు. ” అంటూ ముగించాడు.....
ఈల వేసాడు మాష్టారు.......అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు...కొందరు ఆ తాడు ముట్టుకోకుండానే మధ్యలోనే వెనక్కి పరిగెత్తారు..........అందరికి కంటే నేనే గొప్ప వాడిని ...అసలు నేను పరిగెట్టలేదు .....ఎలాగు ఇదే చివరకు కదా అందరూ రావాల్సింది అని.....
No comments:
Post a Comment