Apr 6, 2015

ఒక జ్ఞాపకం

జీవితం చాల అందమైనది... ఎన్నో అనుబూతులు...మరెన్నో జ్ఞాపకాలు..
నా చిన్నతనంలో, నా చిన్ని ప్రపంచంలో.. ఓ రోజు ...మా తాత నన్ను గోదావరిఖని నుండి అమ్మమ్మ వాళ్ళింటికి తీస్కేల్తున్నాడు...చీకటి అయ్యింది....ఎడ్లబండి లో వెళ్తున్నాం ఇద్దరం... దూరంగా కొన్ని వందల సంక్యలో..విద్యుద్దీపాలు...పసుపు ఎరుపు కలగలిపిన రంగులో...నాకు అపురూపంగా కనిపించింది ఆ దృశ్యం...నేను మా తాత ఇద్దరమే..చుట్టూ దట్టమైన అడవి..గతుకుల రోడ్డు....అరిచి గోల పెట్టినా ఎవరికీ వినపడనంత నిర్మానుష్యం......ఎడ్ల బండి అటు ఇటు దొర్లుతుంది...నా చూపంత ఆ లైట్స్ మీదే ఉంది...నాకు అదొక అద్బుత దృశ్యం..రామగుడం NTPC లైట్స్ అవి..అన్ని లైట్స్ ని చూడటం అదే మొదటి సారి...ఎంత అద్భుతం...ఒక ఫ్యాక్టరీ మొత్తం విద్యుద్దీపాలతో నింపేసారు...ఆ సీన్ కనుమరుగు అయిపోయే వరకు తల తిప్పకుండా అటువైపే చూస్తూ ఉండి పోయా..మద్య మద్య లో మిణుగురు పురుగులు..ఏవేవో కీటకాల శబ్దాలు....అయినా నా దృష్టంతా ఆ లైట్స్ మీదే... నాకు గుర్తుకున్న మొదటి వెలుగులు అవి... మా తాత వాళ్ళింటికి వచ్చేసాం. మొత్తం చీకటి... నాకు ఎం కనిపించట్లేదు...అడ్డంగా బర్లు...తోక్కకుడనివి తొక్కుకుంటూ..వీదిలో నుండి ఇంట్లోకి వచేసా...కిటకి దగ్గర ఒక కిరసనాయలు దీపం..విపరీతమైన పొగతో బలవంతంగా వెలుగుతుంది... నా కళ్ళలో అదే అపురూప దృశ్యం...మిరిమిట్లు గొలిపే ఆ వెలుగులు....రాత్రంతా అదే ఆలోచిస్తూ పడుకున్న...అలా మొదలైంది నా జీవితం లో వెలుగుల పరిచయం...
మా నానమ్మ వాళ్ళిల్లు ఒక పూరి గుడిసె.... బయట కొట్టం లో మాత్రమె ఒక ఎర్ర బల్బు ఉండేది...పడుకునే వరకు ఆ బల్బు అక్కడే ఉంచి పడుకునే టైం లో లోపల పెట్టె వారు...అది కూడా రెండు గదుల మద్యలో...రెండు గదులకి ఒకే బల్బు తో వెలుగు వచ్చేలా...
ఒక రోజు నాకు నిద్రలో మెలుకువ వచ్చింది...భయం..నేను అప్పుడు అరవలేదు.. ఎందుకో తెలియదు...కాదు గుర్తులేదు.. సరిగ్గా నా పైన..వాసాల మధ్యలో ఒక పాము తిరుగుతుంది... గుండె అదిరిన శబ్దం.. పక్కన ఎవరు పడుకున్నారో..ఎవరిని నేను ఎందుకు లేపలేదో మరి.. అరిస్తే పాము నా మీద పడుతుందో.. పగ పడుతుందో అని కావొచ్చు... ఆ బల్బు వెలుగు ఆగకూడదు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ..దుప్పటిలో నుండి పాము నే గమనిస్తూ...ఏమో.. ఎప్పుడు పడుకున్నానో... నన్ను బయపెట్టిన ఒక చీకటి రాత్రి....
కొన్ని సంవత్సరాలకి..మళ్ళి అమ్మమ్మ వాళ్ళిల్లు... ఈసారి పచ్చని..ఎర్రని బల్బులు.. చిన్న చిన్నవి ఇంకా చాలానే... టేప్ రికార్డర్.. అది స్టార్ట్ చేసినప్పుడల్లా.. దానికి ఉన్న చిన్న బల్బులు చాల చిత్రంగా వెలిగేవి...పాటకు అనుగుణంగా అవి వెలుగుతూ ఉండేవి.. ఉదయం లేస్తూనే అక్కడికి వెళ్ళే వాడిని ఆ వెలుగుల కోసం... తిన్న దానికి ఎదురుగానే.. పడుకుంటే దాని పక్కనే.. టేప్ రికార్డర్ రివైండ్ చేయడం.. ఓ సరదా... ఆ చిత్రమైన రంగు రంగుల వెలుగుల బల్బులు..ఆ టేప్ రికార్డర్....
ఆ కాంతి తెలుపు రంగులో ఉంటుంది.... ఇల్లంతా ఈసారి తెల్లని వెలుగులు..ఎంత బావుంది.. ట్యూబ్ లైట్ అంట.... నాకు అది టీప్ లైట్ గ తెలుసు.. బయటి నుండి చూస్తూ... లోపలి వెళ్లి చూస్తూ... ఎంత వెలుగు... చ ఇన్ని రోజులు ఆ డొక్కు ఎర్ర బల్బు... ఈ వెలుతురు ఎంత బాగుందో.. ఎంతో సంబురం.. తెల్లని పాల రంగు వెలుగులు...ఆ ఆశ్చర్యాన్ని ఎవరైనా బొమ్మ గీసుంటే బాగుండేది...
ఈసారి మరిన్ని రంగులు జత కలిసాయి..మా ఊరి గుడి జాతరకి గుడి మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేసారు. ఎన్ని రంగుల వెలుగులో... నీలం..పసుపు..పచ్చ..ఎరుపు..గులాబి.. లయబద్దంగా వెలుగుతూ ఆగుతూ ఉంటాయ్.. మరో చిత్రం నా మదిలో.....
అలా ఎన్నో రంగుల వెలుగులు నా జీవితాన్ని పలకరిస్తూనే ఉన్నాయి...
**********************************************************************************
ఈరోజు నేను బాగ్యనగరం లో .. బాహ్య వలయ రహదారి... అదే.. ఔటర్ రింగ్ రోడ్ లో.....నేను..నా పక్కన డ్రైవర్...ఎంతో సాఫీగా కార్ లో... ఇంత రాత్రి లో కూడా రణగొణ ద్వనులు....ఎన్నో దీపాలు... ఎన్నో రంగులు... పగటిని తలపించే వెలుగు... నగరం మొత్తం వాటి రాజ్యమే...
చిన్న గదిలో వెలుగు కోసం వెతుక్కున్న నేను... ఆ వెలుగు మధ్యలో బందీ అయ్యానేమో అనేట్టుగా....
కొంచం కూడా ఆశ్చర్యం లేకుండా.... పెదవి విరుపుతో నవ్వు పుట్టిస్తూ...నా ప్రయాణం సాగిస్తూ...

No comments:

Post a Comment