ఒక
ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. చాల రోజుల నుండి తినడానికి తిండి లేక పస్తులు
ఉంటున్నారు. పిల్లలు ఎంత గోల చేసిన రేపు, మాపు అని ఏదో ఒకటి చెప్పి వాళ్ళ తండ్రి
పిల్లల్ని మభ్యపెట్టేవాడు. కొన్ని రోజులు గడిచాక ఆకలికి తట్టుకోలేని పిల్లలు వాళ్ళ
తండ్రిని అడగడం మొదలు పెట్టారు.
“
నాన్న! ఇంకా మాకు భోజనం ఎప్పుడు పెడతావు, చాల రోజుల నుండి ఎం తినలేదు.. ఆకలి
చంపేస్తుంది” అని!
దానికి
వాళ్ళ నాన్న, “ ఇంకా కొన్ని రోజులే నాయన! ఇది ఎండాకాలం, ఇంకో రెండు నెలల్లో వాన
కాలం వచ్చేస్తుంది, వానలు పడగానే విత్తనాలు నాటి, బియ్యం రాగానే తినడం. కొన్ని
రోజుల్లోనే మన కష్టాలు తీరుతాయి, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి” అని వాళ్ళకు
నచ్చజెప్పాడు.
అలా
నాన్న చెప్పిన మాటల మీదుగా వానాకాలం వచ్చే వరకు పిల్లలు ఎదురుచూసి, వానాకాలం మొదలు
అవగానే ఆకలి అని మల్లి గొడవ మొదలు పెట్టారు.
వాళ్ళ
నాన్న మళ్ళి “ఎలాగు వర్షాలు రానే వచ్చాయి, రేపు విత్తులు జల్లితే కొన్ని
రోజుల్లోనే మొలకలు వస్తాయి, రెండు నెలల్లో పంట చేతికి వస్తుంది, రాగానే అమ్మ అన్నం
వండి పెడుతుంది” అని పిల్లలకు దైర్యం చెప్పాడు.
అలా
వాళ్ళ నాన్న ఏదో ఒకటి చెప్తూ పిల్లల్లో దైర్యం నింపెవాడు....
అలా
అలా పిల్లలు పంట ఎదిగే వరకు ఆకలితోనే ఎదురుచూడ సాగారు. అలా చాలాకాలం తర్వాత
వాళ్ళింటికి బియ్యం వచ్చేసింది... పిల్లలు ఆదుర్దాగా మళ్ళి వాళ్ళ నాన్నని అడగడం
మొదలు పెట్టారు.. ఇంకా ఎప్పుడు తినటం అని..
అమ్మ
వండడం అవగానే తినేద్దాం అని వాళ్ళ నాన్న చెప్పాడు.
ఆకలికి
ఉండపట్టలేని పిల్లలు అమ్మని అడిగారు, ఇంకా ఎంత సేపట్లో తినటం అని...
“అయ్యో!
అప్పుడేనా? ఇంకా
బియ్యం చెరగాలి, వాటిని కడగాలి, పొయ్యి పెట్టాలి, అన్నం ఉడక పెట్టాలి మధ్యలో గంజి
వార్చాలి ఆ తర్వాత అన్నం అవుతుంది అప్పటి వరకు మనం తినలేం”
అంత
వరకు ఆగలేని ఆ పిల్లల గుండె ఒక్కసారిగా ఆగిపోయింది, అక్కడికక్కడే తుది శ్వాస
విడిచారు.
ఈ
కథలోని సాధ్యాసాధ్యాలను కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే..మా మావయ్య చెప్పిన ఈ కథ నా
మనసుకి చాల నచ్చింది..అన్ని రోజులు పిల్లలు వేచి చూసారా అన్న వెధవ ప్రశ్నలు
వేయకుండా ఆలోచిస్తే..
మన
ఆలోచన విధానం ఎప్పుడు ఆశావహ దృక్పథంలో ఉంటేనే బాగుంటుంది అని నన్ను కాసేపు నన్ను
ఆలోచింపచేసింది...... మా మావయ్య చాలా పెద్దగా చెప్పాడు.. నేను చాలా చిన్నగా
రాసాను.
No comments:
Post a Comment