ఒకసారి వేసవి సెలవుల్లో మా బావ పెళ్ళికని అత్తమ్మ వాళ్ళింటికి వెళ్ళాము అందరం. తెల్లవారితే పాల పొరక కి వెళ్ళాలి. ఉదయం అవనే అయ్యింది. ఎండ్లబండ్లు సిద్దం అయ్యాయి. మా చిన్నబావ, నేను ఒకే ఎడ్లబండిలో ఎక్కాం. కాసేపటికి ముందుకు కదిలాయి. అలా ఊరి చివరికి వెళ్ళగానే... ఎందుకోనో సందేహం వచ్చి మా బావ ని అడిగా..
“బావ మనం ఎక్కడి వరకు వెళ్తున్నాం...ఇక్కడ ఎక్కడ పాల చెట్టు లేదా?” అని...
ఇక్కడెక్కడ లేదు పక్క ఊరికి వెళ్ళాలి అని చెప్పాడు మా బావ. మనలో బద్దక రాముడు మేల్కొన్నాడు. ఇప్పుడు అంత దూరం వెళ్ళాల...ఇక్కడే దగ్గరే అంటే ఏదో ఆవేశపడి ఎక్కా గాని అంత దూరం అంటే నేను రాను పో.... అంటూ చక చక బండి దిగేసి...ఇంటి వైపు నడక మొదలు పెట్టాను.....ఇక్కడ కూడా మరో సారి బద్దక రాముడు అడ్డుపడి....
” ఒరేయ్! ఇలా రోడ్డు మీదుగా వెళ్తే చాలా దూరం అలా మద్య దారి గుండా పో! “ అని ఒక దారి చూపించాడు.
అది మొత్తం మైదాన ప్రాంతం..... చుట్టూ చెట్టు చేమలు తప్ప ఏమి లేవు... కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా లేడు.... కాసేపటికి మైదాన ప్రాంతం మద్య లోకి వచ్చేసాను.....వేడి గాలి చెవులకు తాకుతుంది....చుట్టూ స్మశాన నిశబ్ధం.... నాకు మెల్లిగా భయం వేయసాగింది....వాళ్ళతో వెళ్ళకుండా ఎందుకు దిగాను... ఇక్కడ ఏదైనా దయ్యం ప్రత్యక్షం అయి నన్ను పట్టుకుంటే నా గతి ఏంటి అని నా బద్దక రాముడ్ని తిట్టుకుంటూ, మెల్లిగా అడుగులు వేయసాగాను....
కాస్త దూరం వెళ్ళాక నా వెనక ఎదో కదుల్తున్న శబ్దం వినిపించింది.....నాకు ఒళ్ళు జలదరించింది...వెనక్కి తిరిగి చూసే దైర్యం లేదు.... వేగంగా అడుగులు వేయడం మొదలు పెట్టాను...నా వెనక కూడా అంతే వేగంగా ఏదో అడుగుల శబ్దం......నేను పరుగందుకున్నాను..... పది అడుగులు పరిగెత్తి ఆగి చూసాను....నా వెనక ఒక పొట్టేలు....పోయిన ప్రాణం లేచి వచ్చింది... హమ్మయ్య! ఇది పొట్టేలు...నేను ఇంకా దయ్యం ఏమో అని బయపడి చచ్చా....కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు....ఆ పొట్టేలు రెండు అడుగులు వెనక్కి వేసి నన్ను కుమ్మడానికి నా వైపు బలంగా పరిగెత్తుకు వచ్చింది....నేను తప్పించుకున్నాను....అయిన అది వదల్లేదు....మళ్ళి అంతే...మరో రెండు అడుగులు వెనక్కి వేసింది...నాకు సీన్ అర్ధం అయ్యింది...
నాకు పొట్టేలు చేతిలో చావడం ఇష్టం లేదు..... పిక్కబల మహా మంత్రాన్ని ఒక సారి గట్టిగా పఠించి... పరుగో..పరుగు... ...కాని మా అత్త వాళ్ళిల్లు ఇంకా చాల దూరం వెళ్ళాలి...నేను ఎంత దూరం వెళ్ళినా నన్ను వదల్లేదు.....నాకు ఆయాసం వచ్చి అగినప్పుడల్లా నేను కాస్త ఆగే వాడిని...అది కూడా ఆగేది...అది ఆ రెండు అడుగులు వెనక్కి వేసే లోపు మళ్ళి.... పరుగో.. పరుగు....అలా అది నన్ను పొలాల గట్లు,మా ఊరి మైదానాలు.... నాకు తెలియని చోట్లకు చాల తిప్పింది......

నేను పరిగెత్తి పరిగెత్తి..... ఒక ఇంట్లో దూరాను.....ఆ ఇంట్లోనుంచి ఒక ఆవిడ అభయ దేవతలా వచ్చి నన్ను ఆ దుష్ట పొట్టేలు నుండి రక్షించింది... అలా ఆ పొట్టేలు బారి నుండి తప్పించుకున్నాను.....కాసేపు అక్కడే కూర్చున్న....ఆమె నా వివరాలు అన్ని అడిగి నేను ఎవరింటికి వచ్చానో అన్ని కనుక్కుంది.....ఆయాసం తీరాక అత్త వాళ్ళింటికి బయలుదేరాను.... నేను వెళ్ళిన చాల సేపటికి పాల పోరకకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు... మధ్యాన్నం అంతా మా చిన్న బావ తో ఎక్కడెక్కడో తిరిగి నేను సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసాను.....
చుట్టాలు అందరూ అరుగు మీద కూర్చొని నవ్వుతున్నారు....నేను వెళ్ళే సరికి వాళ్ళ నవ్వు ఎక్కువైంది...నాకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియలేదు....మా వదినవచ్చి....నిన్ను పొట్టేలు తరిమిందా....? అంటూ తెగ నవ్వేసింది... అప్పుడు అర్ధం అయ్యింది...వాళ్ళు అందరూ ఎందుకు నవ్వుతున్నారో.... నాకు చాలా సిగ్గేసింది... చ! ఆ పొట్టేలు చేతిలో చచ్చినా అయిపోయేది.....
పెళ్లి అయిపొయింది.... మేము మా ఊరికి వచ్చేసాం......కాలక్రమేనా దసరా సెలవులు దగ్గరకు వచ్చాయి.....
మా బావకి రెండో పెళ్లి.... మొదటి పెళ్లి వీగిపోయింది...ఎలాగు సెలవులు కదా అని ఈసారి కూడా అందరం వెళ్ళాం.....
పెళ్లి కి మూడు రోజుల ముందు పోశమ్మ కి బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు ని తీస్కువచ్చారు మామ వాళ్ళు...
మా చిన్న బావ దాన్ని చూపిస్తూ చెప్పాడు...నిన్ను ఊరంతా తరిమిన పొట్టేలు గుర్తుందా? ఇదే అది.
ఆ సమయం లో నాకు పగ ప్రతీకారాలు గుర్తు రాలేదు.... పాపం! బలి అనే పేరుతో మరో మూగ జీవాన్ని చంపుతున్నందుకు దాని మీద చాల జాలి వేసింది....ఆర్నెల్ల క్రితం ఎంతో స్వేచ్చగా, గర్వంగా తిరిగింది...
ఇప్పుడు బలికి సిద్దమైంది....దానికి నేను గుర్తుకు ఉన్నానో లేదో అసలు....
No comments:
Post a Comment