Jul 31, 2011

.....

చీకటి పడి చాలా సేపు అయ్యింది ఇంకా ఈ కంప్యూటర్ ల్యాబ్ లో ఉండడం నాకిష్టం లేదు... త్వరగా వెళ్లి పోవాలి, లేదంటే చివరి బస్సు కూడా వెళ్ళిపోతుంది.. ఆదుర్దాగా బ్యాగ్ సర్దుకున్నాను... ఇంటికి ఆలస్యం అయిపోయిందనే కంగారు మొదలైంది.... వడి వడిగా అడుగులు వేస్తూ బయటికి కదిలాను...అప్పటి వరకు కుండపోతగా వర్షం కురిసి ఆగిపోయింది...అప్పటికే చుట్టూ దట్టమైన చీకటి పేరుకుపోయింది...నేను బయటకు రాగానే అప్పటి వరకు ఉన్న కరెంట్ కూడా పోయింది... నిండు పున్నమిని మేఘాలు కప్పేసాయి... దారి అంతా కూడా నిర్మానుష్యం. నా బస్సు స్టాప్ కి వచేసాను..అక్కడ కూడా ఎవరు లేరు...నాకు తెలిసి ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయినట్టు ఉంది... చేతికి పెట్టుకున్న గడియారం పనిచేయట్లేదు.. ఎంత సేపు నిరిక్షించాలో..!!

వచ్చేస్తుంది.. ఎప్పుడు ఈ బస్సు నేను చూడలేదు... బోర్డు కూడా లేదు..అయిన సరే ఎ బస్సు అయిన నేను వెళ్ళే దారి మీదుగానే వెళ్ళాలి కదా...తెల్లని దీపాలు బస్సంతా వెలుగుతున్నాయ్..అంత చీకటిలో ఆ బస్సు వెలుగుకి దారి అంతా కనిపిస్తుంది... నా ముందే వచ్చి ఆగింది... బస్సు లోకి ఎక్కాను...

బస్సులో ఎవరు లేరు..అంతా కాలిగా ఉంది....దూరంగ ఒక మూలగా కిటికీ పక్కన కూర్చున్నాను... బస్సు కదిలింది.. కిటికీ లోంచి చల్లగా గాలి తగిలింది... ఒళ్లంత ఒకసారి జలదరించింది.... ఎంతగా చూసిన ఆ కారుచీకట్లో ఏమి కనిపించట్లేదు... నిర్మనుశ్యానికి నిశ్శబ్దం తోడైనట్టుగా ఉంది...

ఓవర్ బ్రిడ్జి దాటేసింది....తోళ్ళవాగు..... వెళ్తూనే ఉంది..ఎక్కడా ఆగట్లేదు... దారంతా  ఎవరూ లేరు....

ఎవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయ్..... రోజంతా ఎక్కడెక్కడో తిరిగాను...

ఆలోచనల ప్రవాహం.......అక్కడే.. అదే ఆలోచనల ప్రవాహం లో ఎంతో సేపు గడిపాను... అక్కడి నుండి బయటికి రావాలని లేదు....

 చాల సేపు అయ్యింది బస్సు బయల్దేరి....ఈపాటికి నేను వెళ్ళే చోటు దాటేయ్యాలి.....

 బయటకి చూసాను....

నిశ్శబ్దం...చుట్టూ నిశ్శబ్దం....చీకటి అలుముకున్న నిశ్శబ్దం...

ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగ ఉరుములు మెరుపులతో మళ్ళి వర్షం మొదలైంది.... ఇంకాస్త చల్లగా గాలి వీయడం మొదలైంది...

చుట్టూ చూసాను...కండక్టర్ లేడు .....ఒక్కన్నే ఉన్నాను బస్సు లో.. ఆశ్చర్యం!.. మళ్ళీ ఒకసారి కిటికీ లోనుండి చూసాను....ఇది నా దారి కాదు...ఎప్పుడూ చూడలేదు ఆ ప్రదేశం....

నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియట్లేదు... ఏదో తెలియని ప్రపంచం లో ఉన్నాను....నా చుట్టూ ఇప్పుడున్న ప్రపంచం నాది కాదు అని నాకు స్పష్టంగా తెలుస్తుంది...

నేను ఎక్కడో...నాకు తెలియని చోటులో....నాది కానీ ప్రపంచంలో...

ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మదిలో లేదు.....ఎందుకో అలాగే మౌనంగా కూర్చుండి పోవాలి అనిపిస్తుంది..

ఉరుముల శబ్దం ఇంకా ఎక్కువైంది...వాన జల్లు కొద్ది కొద్ది గా నా మీద పడుతుంది... ఏదో తెలియని అపస్మారక స్థితి లోకి వెళ్తున్నాను.... నా ఒంట్లో శక్తి తగ్గిపోతుంది...కదల్లెకుండా ఉన్నాను....

నేను బతికే ఉన్నానా?.....

నా చూపులు ఎం వెతకట్లేదు.......  ఆలోచన పనిచేయడం ఆగిపోయింది.... నేను నా ఆధీనం లో లేను..... అయిన కూడా మౌనం వీడాలని లేదు..... నా మీద నాకు క్రమంగా పట్టు తప్పిపోతుంది....ఎం చేయాలో తెలియట్లేదు......

“భయంగా ఉందా!!” డ్రైవర్ సీట్లోంచి గంబీరమైన స్వరం వినిపించింది...

అటు వైపుగా చూసాను..అక్కడ ఎవరూ లేరు...ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్వరం..?

వాన తగ్గిపోయింది..వెలుగును కప్పేసిన చీకట్లో దారి అంతా మసకగా కనిపిస్తుంది...నాకు తెలిసిన చోటులా అనిపిస్తుంది...ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా...కానీ బస్సు మాత్రం ఎక్కడా ఆగట్లేదు....

అదే కిటికీ.....బయటకి తొంగి చూస్తూనే ఉన్నాను... నాకు తెలిసిన వాళ్ళు అందరూ అక్కడక్కడ కనిపిస్తున్నారు.....వాళ్ళంతా నావైపే చూస్తున్నారు.. కానీ నన్ను మాత్రం పిలవట్లేదు...

నన్ను చిన్నప్పుడు బడికి తీస్కు వెళ్ళిన మా టీచర్.... నాతో ఆడుకున్న రవి.. మా తాతయ్య...బందువులు...అందరూ...అందరూ అక్కడే ఉన్నారు... నా వంకే దీనంగా చూస్తూ..

నాకూ  వాళ్ళని పిలవాలని లేదు.....మెల్లిగా కటిక చీకటి ఆవరించింది...ఎంతగా చూసిన ఏమి కనిపించట్లేదు...

మళ్ళీ వర్షం.....

“భయంగా ఉందా..?” అదే గొంతు...

లేదు అని చెప్పాలని ఉంది... కానీ చెప్పలేకపోతున్న... నా పెదవులు కదలట్లేదు...

Jul 27, 2011

మావయ్య కథ – 1మా మావయ్య నా బద్ధకం గురించి ఎప్పుడూ చెప్పే కథ ఇది.....

ఒక ఊరిలో ఇద్దరు బద్దకస్తులు ఉండే వాళ్ళు.... వాళ్ళు ఒక సారి ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది.....తప్పనిసరి పరిస్థితి లో బయలుదేరారు.....

దారి మద్య లో.. అలసట రాక ముందే.....  ఎక్కడ అలసట వచ్చేస్తుందో అని వాళ్ళిద్దరూ అక్కడ కనపడిన ఒక రేగు చెట్టు కింద పడుకున్నారు....

కాసేపటికి అందులో ఒకడికి.....దూరంగా కట్టెల మోపు మోసుకుని వెళ్తున్న ఒక ముసలి వాడు కనిపించాడు, ఆ ముసలి వాడిని చూసి..”ఓ! తాతా...!  ఒకసారి ఇటు రా....” అని గట్టిగా అరిచాడు...

ముసలివాడు వాళ్ళను చూసి.... ఎందుకు పిలుస్తున్నారో తెలియక ముందుకు సాగిపోయాడు....

ఈ సారి ఇంకా గట్టిగా “ఓ! తాతా ...! తొందరగా ఇటు రావయ్య.....” అని అరిచాడు...

ఆ పిలుపుకి కంగారు పడ్డ ముసలివాడు...వాళ్లకు ఏదో అయ్యింది అనుకొని కట్టెల మోపు అక్కడే పడేసి, వాళ్ళ దగ్గరకి పరుగెత్తుకు వచ్చాడు...

“ఏమైంది నాయన....! ఏమైంది...???” అని అడిగాడు ముసలివాడు...

“ఆ పక్కన ఓ రేగు పండు పడింది...తీసి నోట్లో పెట్టావా!” అన్నాడు మొదటివాడు....

దాంతో చిర్రెత్తిపోయిన తాత....వాణ్ని కొట్టడం మొదలెట్టాడు......

ఇంతలో రెండోవాడు....
  కొట్టు! బాగా కొట్టు వెధవని!....అప్పటి నుండి ఈ కుక్క నా మూతి నాకుతుంటే కనీసం దూరంగా కొట్టట్లేదు..!!!!”

Jul 23, 2011

వేదన


మనుషులు చేసిన గాయం మాని పోతుంది....

మనసులు చేసిన గాయం..??

మాని పోయినా మాసిపోదు...తిరిగి వచ్చే అలల కెరటంలా ఎప్పుడు మన హృదయాన్ని కలిచివేస్తుంది....

కాలం కూడా కొన్ని జ్ఞాపకాలను చెరిపి వేయలేదు.....

పరీక్షా సమయం......నాకు కాదు మాష్టార్లకి.


నా జీవితం లో మొట్ట మొదటి పరీక్ష అది... అగ్ని పరీక్ష కాదు... U.K.G. పరీక్ష....ముందు రాత్రి చాల కష్టపడి చదివా....

అన్ని రోజుల్లాగే ఆరోజు కూడా తూర్పు దిక్కునే ఉదయించాడు సూర్యుడు....

ప్రశ్నాపత్రం ఇచ్చేసారు.... కష్టమైన ప్రశ్నలు చాలానే ఉన్నాయి...

ఆశ్చర్యం.....సిలబస్ లో లేని ప్రశ్నలు కూడా ఇచ్చారు.... నాకు దిమ్మ తిరిగి పోయింది... గుండె చప్పుడు నాకు తెలస్తుంది... చెమటలు పట్టేసాయ్......దిక్కులన్ని చీకటి అయిపోయాయ్... అందులో ఒక ప్రశ్న...

Q. What is your name?

ఎక్కడో చూసినట్టుగా....   కాదు విన్నట్టుగా ఉంది......

నా చుట్టూ పేరుకు పోయిన చీకట్లలో  కొవ్వత్తి వెలిగింది.... నాకు లీలగా గుర్తువస్తుంది....ఆరోజు మాష్టారు ఒకటో తరగతి వాళ్ళకు చెప్తున్నారూ......

నాకు జవాబు వచ్చేసింది... పట్టలేని ఆనందం నాలో...ఒక్కసారిగా ప్రశ్నాపత్రం చించేసి “హుర్రే!!!!...” అని అరవాలి అనిపించింది.... కాని ఆ గుడ్లగూబ మాష్టారు నా వైపే చూస్తున్నారు....సరే అరవడం ఎలాగు బయటికి వెళ్ళాక అరవచ్చులే అనుకొని...నా ఏకాసంతాగ్రహతకి కి మురిసిపోతూ జవాబు మొదలు పెట్టాను...

మద్యలో... ఎం చేయాలో అర్ధం కాలేదు... చాల కష్టంగా అనిపించింది.... అయిన సరే నాకు పుట్టుక తోనే అబ్బిన తెలివి తేటలు అన్నీ ఉపయోగించి మొత్తానికి పూర్తి చేసాను....

చాల అలసి పోయాను నాకు కొంచం విశ్రాంతి కావాలి.....మాష్టారుకి చిటికన వేలు చూపించి బయటకు వెళ్ళాను...

తిరిగి వచ్చేసరికి మాష్టారు నా పేపర్ చూస్తున్నారు.... మాష్టారు కళ్ళల్లో అనందం.. పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు  కోడికి కలిగే ఆనందం..... చంద్రముఖి కి కాలి గజ్జెలు దొరికినప్పటి పరవశం... మాష్టారు కళ్ళల్లో కనిపించాయ్....అప్పుడే వస్తున్న నన్ను చేతుల్లోకి తీస్కొని గాల్లోకి ఎగిరేసి.... ఓ ముద్దు కూడా పెట్టుకున్నాడు.... నేను చాల గర్వంగా అందరివైపు ఓ చూపు చూసి మిగితా పరీక్షా పూర్తి చేసాను.....

తిరిగి వాళ్ళు దిద్దిన పేపర్లు ఇచ్చే వరకు తెలియలేదు నేను చేసిన ఘనకార్యం ఏంటో అని..... నా పేరు ఇంగ్లీష్ లో రాయడం తెలియక...

MY NAME IS సంజీవ్ “

అని రాసా....

Jul 21, 2011

పరుగో... పరుగు....

ఒకసారి వేసవి సెలవుల్లో మా బావ పెళ్ళికని అత్తమ్మ వాళ్ళింటికి వెళ్ళాము అందరం. తెల్లవారితే పాల పొరక కి వెళ్ళాలి. ఉదయం అవనే అయ్యింది. ఎండ్లబండ్లు సిద్దం అయ్యాయి. మా చిన్నబావ, నేను ఒకే ఎడ్లబండిలో ఎక్కాం. కాసేపటికి ముందుకు కదిలాయి. అలా ఊరి చివరికి వెళ్ళగానే... ఎందుకోనో సందేహం వచ్చి మా బావ ని అడిగా..

“బావ మనం ఎక్కడి వరకు వెళ్తున్నాం...ఇక్కడ ఎక్కడ పాల చెట్టు లేదా?” అని...

 ఇక్కడెక్కడ లేదు పక్క ఊరికి వెళ్ళాలి అని చెప్పాడు మా బావ. మనలో బద్దక రాముడు మేల్కొన్నాడు. ఇప్పుడు అంత దూరం వెళ్ళాల...ఇక్కడే దగ్గరే అంటే ఏదో ఆవేశపడి ఎక్కా గాని అంత దూరం అంటే నేను రాను పో.... అంటూ చక చక బండి దిగేసి...ఇంటి వైపు నడక మొదలు పెట్టాను.....ఇక్కడ కూడా మరో సారి బద్దక రాముడు అడ్డుపడి....

” ఒరేయ్! ఇలా రోడ్డు మీదుగా వెళ్తే చాలా దూరం అలా మద్య దారి గుండా పో! “ అని ఒక దారి చూపించాడు.

అది మొత్తం మైదాన ప్రాంతం..... చుట్టూ చెట్టు చేమలు తప్ప ఏమి లేవు... కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా లేడు.... కాసేపటికి మైదాన ప్రాంతం మద్య లోకి వచ్చేసాను.....వేడి గాలి చెవులకు తాకుతుంది....చుట్టూ స్మశాన నిశబ్ధం.... నాకు మెల్లిగా భయం వేయసాగింది....వాళ్ళతో వెళ్ళకుండా ఎందుకు దిగాను... ఇక్కడ ఏదైనా దయ్యం ప్రత్యక్షం అయి నన్ను పట్టుకుంటే నా గతి ఏంటి అని నా బద్దక రాముడ్ని తిట్టుకుంటూ, మెల్లిగా అడుగులు వేయసాగాను....

కాస్త దూరం వెళ్ళాక నా వెనక ఎదో కదుల్తున్న  శబ్దం వినిపించింది.....నాకు ఒళ్ళు జలదరించింది...వెనక్కి తిరిగి చూసే దైర్యం లేదు.... వేగంగా అడుగులు వేయడం మొదలు పెట్టాను...నా వెనక కూడా అంతే వేగంగా ఏదో అడుగుల శబ్దం......నేను పరుగందుకున్నాను.....  పది అడుగులు పరిగెత్తి  ఆగి చూసాను....నా వెనక ఒక పొట్టేలు....పోయిన ప్రాణం లేచి వచ్చింది... హమ్మయ్య! ఇది పొట్టేలు...నేను ఇంకా దయ్యం ఏమో అని బయపడి చచ్చా....కాని నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు....ఆ పొట్టేలు రెండు అడుగులు వెనక్కి వేసి నన్ను కుమ్మడానికి  నా వైపు బలంగా పరిగెత్తుకు వచ్చింది....నేను తప్పించుకున్నాను....అయిన అది వదల్లేదు....మళ్ళి అంతే...మరో రెండు అడుగులు వెనక్కి వేసింది...నాకు సీన్ అర్ధం అయ్యింది...

నాకు పొట్టేలు చేతిలో చావడం ఇష్టం లేదు..... పిక్కబల మహా మంత్రాన్ని ఒక సారి గట్టిగా పఠించి... పరుగో..పరుగు... ...కాని మా అత్త వాళ్ళిల్లు ఇంకా చాల దూరం వెళ్ళాలి...నేను ఎంత దూరం వెళ్ళినా నన్ను వదల్లేదు.....నాకు ఆయాసం వచ్చి అగినప్పుడల్లా నేను కాస్త ఆగే వాడిని...అది కూడా ఆగేది...అది ఆ రెండు అడుగులు వెనక్కి వేసే లోపు మళ్ళి.... పరుగో.. పరుగు....అలా అది నన్ను పొలాల గట్లు,మా ఊరి మైదానాలు.... నాకు తెలియని చోట్లకు చాల తిప్పింది......
నేను పరిగెత్తి పరిగెత్తి..... ఒక ఇంట్లో దూరాను.....ఆ ఇంట్లోనుంచి  ఒక ఆవిడ అభయ దేవతలా వచ్చి నన్ను ఆ దుష్ట పొట్టేలు నుండి రక్షించింది... అలా ఆ పొట్టేలు బారి నుండి తప్పించుకున్నాను.....కాసేపు అక్కడే కూర్చున్న....ఆమె నా వివరాలు అన్ని అడిగి నేను ఎవరింటికి వచ్చానో అన్ని కనుక్కుంది.....ఆయాసం తీరాక అత్త వాళ్ళింటికి బయలుదేరాను.... నేను వెళ్ళిన చాల సేపటికి పాల పోరకకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు... మధ్యాన్నం అంతా మా చిన్న బావ తో ఎక్కడెక్కడో తిరిగి నేను సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసాను.....
చుట్టాలు అందరూ అరుగు మీద కూర్చొని నవ్వుతున్నారు....నేను వెళ్ళే సరికి వాళ్ళ నవ్వు ఎక్కువైంది...నాకు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియలేదు....మా వదినవచ్చి....నిన్ను పొట్టేలు తరిమిందా....? అంటూ తెగ నవ్వేసింది... అప్పుడు అర్ధం అయ్యింది...వాళ్ళు అందరూ ఎందుకు నవ్వుతున్నారో.... నాకు చాలా సిగ్గేసింది... చ! ఆ పొట్టేలు చేతిలో చచ్చినా అయిపోయేది.....

పెళ్లి అయిపొయింది.... మేము మా ఊరికి వచ్చేసాం......కాలక్రమేనా దసరా సెలవులు దగ్గరకు వచ్చాయి.....

మా బావకి రెండో పెళ్లి.... మొదటి పెళ్లి వీగిపోయింది...ఎలాగు సెలవులు కదా అని ఈసారి కూడా అందరం వెళ్ళాం.....

పెళ్లి కి మూడు రోజుల ముందు పోశమ్మ కి బలి ఇవ్వడానికి ఒక పొట్టేలు ని తీస్కువచ్చారు మామ వాళ్ళు...

మా చిన్న బావ దాన్ని చూపిస్తూ చెప్పాడు...నిన్ను ఊరంతా తరిమిన పొట్టేలు గుర్తుందా? ఇదే అది.

ఆ సమయం లో నాకు పగ ప్రతీకారాలు గుర్తు రాలేదు.... పాపం! బలి అనే పేరుతో మరో మూగ జీవాన్ని చంపుతున్నందుకు దాని మీద చాల జాలి వేసింది....ఆర్నెల్ల క్రితం ఎంతో స్వేచ్చగా, గర్వంగా తిరిగింది...

ఇప్పుడు బలికి సిద్దమైంది....దానికి నేను గుర్తుకు ఉన్నానో లేదో అసలు....

Jul 15, 2011

Komuravelli Mallanna 
komuravelli mallanna is a famous god in northern telangana. The main devotees for mallanna god is from golla and kapu caste. Mallanna is the incarnation of Lord Shiva. The god appears in terrified form with big mustache. Mallanna often refered as beerappa, but both are different.
God Mallanna (Malia Reddy) who was fabled to have originally been a Kapu by caste. It is believed that Mallanna was born out of Mali Chemata (the next sweat) of Lord Siva, tholichemata(first sweat) turned as Beerappa. Malia Reddy was the son of Neelamma and Adi Reddy, the ruler of Kolhapur.

i got the following information from some of the websites..........

Komuravelli 'Sri Mallikarjuna Swamy Devasthanam' is one of the prominent Siva temples in the northern Telangana region of Andhra Pradesh. It is next to Rajarajeshwara Swamy Temple-Vemulawada and Mukteshwara Swamy Temple-Kaaleshwaram in popularity. The pilgrims often refer to the god as 'Komaravelli Mallana'. The temple is located in a cave on the 'Indrakeeladri' hillock. The uniqueness of this temple is that the lord shiva appears here in 'vigraha rupam'(statue) other than the usual 'linga rupam'. The statue is believed be 500 years old and is made up of 'putta mannu'(Soil used in building ant hills) and still in tact.

It is believed that the lord has married 'Gollakethamma' from Yadava community and 'Medalamma' from the Linga Balija community and settled here. So, both the goddesses are equally worshiped here. As a sentiment, the people from both Yadava and Balija communities head all the important rituals.

This temple is dedicated to Lord Sri Mallikarjuna swamy a fierce looking diety along with Kethamma and Medalamma on the both sides of the main diety. The temple is located in a cave on a small hillock at a distance of 110 Kms from warangal. Lakhs of piligrims congregate on the eve of Makara Sankranthi as Brahmotsavam starts. The clay moulded diety of Lord Mallikarjuna swamy is believed to be made 500 years ago.

The temple is renovated and mandapamas and choultries etc., are constructed by Endowments Department. The 'pedda patnam' celebrated on Maha Sivaratri day attract pilgrims in lakhs. It is located at a distance of 85 kms from the state capital on Karimnagar - Hyderabad - Highway (Rajiv Rahadari). People also calls him as "Komuravelli Mallanna", this temple is one of the famous temple in Telangana Region.
In the temple of Mallikarjuna of Inavolu near Warangal, men belonging to the kurumas and Gallas participate in the festival of Mallikarjuna on the occasion of Sankranti day. Their Gods Beerappa and Mallanna were equated with lord Mallikarjuna of Sriparvata. Thus the pastoral and tribal community and panchamas were also integrated or sanskritised through the process of fa'irs and festivals.
by...Sunny.

komuravelli mallanna story- Marraige with medalamma

There is no written scriptures are available on komuravelli mallanna (often refered as komurelli mallanna or komrelli mallanna) but there are so many folk lore available on komuravelli mallanna adventures which are said to be “oggu kathalu” sung by “oggu singers” .
In one of the stories it is said that komuravelli mallanna brought pasupu(sacred turmeric) and kumkum from macca (muslims holy place).

The story as follows..……(based on a video song)….

When mallanna wanted to marry medalamma, her brothers puts a condition that mallanna should bring bandari (hard turmeric or roots of turmeric i.e.”pasupu kommulu” which are in the possession of haseen and hussain in macca masjid that time) .
In search of way for bandari komuravelli mallanna approaches God shiva. Lord shiva directs him to Lord Ganesha. Komuravelli mallanna goes to Ganesha and asks him about bandari, Lord Ganesha tells him that Mallanna’s sister “yellamma” knows the way to get it.
Then Komuravelli mallanna goes to yellamma and asks about bandari. Yellamma says that it is in macca. Mallanna prepares to go to macca but his sister “yellamma” warns him that macca is so far from here and men are very powerful there, it is impossible to beat them. They kept those things at a secret place that nobody knows it else them. Whoever went to there, they had not returned. Listening to this mallanna prays to gods, they gave him a flying horse. With that horse mallanna goes to macca. Before getting into makka he ties his horse outside the macca. He joins as gardener there and names himself  as malku malloji, he spends so many days there perhaps years. He gains their faith and muslims completely belives him. They tell him the identity of bandari. He goes to the place where it is, A five headed snake protects it. One day he took bandari and tries to run away, but muslims see him and tries to capture him. Mallanna escapes in disguise of a black dog though chased by the duo(haseen and hussain) till the banks of  rives Ganga. Goddess ganga looses her right hand when she confronted the duo and mallanna posts a stick as symbol of her hand and resolves to observe a ritual every year in the memory of goddess Ganga river. Then he returns to his hometown with the help of celestial horse. He gives some portion of bandari to yellamma and marries to medalamma.
As I know the ritual which is celebrated on Goddess ganga name is peerila festival. In some of stories, mallanna cuts one of duo hand in fighting and that hand five fingers stands for five peers in the yearly festival.

Jul 11, 2011

బ్లాగు వీర


లక్ష టపాలతొ బ్లాగు వీరుని బ్లాగు మీదికి దండెత్తి వచ్చాడు టపాఖాన్. .. 

టపాఖాన్: బ్లాగు వీరుడు?? 100 టపాలు చదివినా...మూర్చపోని ధీరుడు..!!
నీ కథలొ నిజముంటే నీ రీడింగ్ లొ పవరుంటే..100 టపాలు పంపుతా ఒంటికి చెమట పట్టకుండా చదవరా చూద్దాం...ఈ బ్లాగువింద ని, ఈ బ్లాగు ని నీకే ఇచ్చేస్తా.... 

బ్లాగు వీర: అర్దం పర్దం లేని టపాలు చూసి మరీ పంపించు! 

టపాఖన్:  ఆ టపాలు చూస్తేనె నీ దిమ్మ తిరిగి పొతుందిరా!!!

బ్లాగు వీర: లెక్క ఎక్కువైన పర్లేదు తక్కువ కాకుండ చూసుకో...

టపాఖన్:  ఒక్క టపా చదవకున్న నువ్వు ఒడినట్టేరా...

బ్లాగు వీర: ఒక్కొక్క టపా కాదు టపాఖాన్... వంద టపాలు ఒకే సారి పంపించు.

టపాఖన్: నీ పొగరు మాటల్లొ కాదురా చదవడంలో చూపించు... నా దిక్కుమాలిన టపాల్లార(టపాఖాన్ అరుస్తాడు). 

బ్లాగు వీరుడు చదవడం మొదలు పెట్టాడు......

1...2....3...

53...

రెండు టపాలు...... బలంగా తాకాయ్..........

బ్లాగు వీరునికి కళ్ళు బయర్లు కమ్మాయ్... %@@%..???

అయినా సరే పట్టు విడవలేదు...

95... 96.....

100 .....
టపాఖాన్:
శబ్భాష్!!! 
ఇంతకాలం నా బ్లాగు పేరు వింటేనె సిస్టం క్లొస్ చేసే వాళ్ళను చూసాను, నా టపా టైటిల్ చూస్తేనె పిచెక్కిన వాళ్ళని చూసాను. కాని టపా లు ఎ భాషలొ ఉన్నాయో కూడా పట్టిచుకోకుండ చదివిన వాడిని నిన్ను మాత్రమే చూస్తున్నానురా....
అఖండ బ్లాగావని ని గడగడ లాడించిన ఈ టపాఖాన్..నీకు సలాం చేస్తున్నాడురా..!!!

కబడ్డీ..

అప్పుడు నేను చాల చిన్నవాడిని..... ఒకటో తరగతి అనుకుంటా..
అది ఒకానొక ఆగష్టు 15, మా స్కూల్లో ఆటల పోటీలు పెట్టడం అదే మొదటి సారి......చాల మంది ఉత్సాహంగా పాల్గొనడం మొదలు పెట్టారు...... మేము చాల చిన్న వాళ్ళం కాబట్టి మాకు ఏ ఆట ఎలా ఆడాలో తెలియదు...ఇదే ముక్క మా మాష్టారు గారికి విన్నవించాం.....ఆయన గారు మమ్ముల్ని అందర్ని పిలిచి ఒక గ్రూపు గా చేసారు.... నాలుగవ తరగతి పిల్లల్ని పిలిచి వాళ్ళని ఇంకో గ్రూపుగా  చేసి.... మా గ్రూపు లో ఒకడికి ఆట ఎం  చేయాలో చెప్పి......అవతలి గ్రూపు తో ఆడమన్నాడు......
వీడు “కబడ్డీ... కబడ్డీ.....” అంటూ వెళ్ళాడు ...... వీడు వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ వీణ్ణి పట్టుకునేసారు..........
“ అర్దమైందా......” అని అడిగారు మాష్టారు......అందరికి ఏమో గాని...నాకు మాత్రం మొత్తం అర్ధమై పోయింది.....ఇంతేనా కబడ్డీ అంటే.....ఇక కబడ్డీ లో మనమే రారాజు.....మనల్ని మించిన వాడు లేడు.....
“అరేయ్ నువ్వు వెళ్ళరా .......” అన్నాడు మాష్టారు నన్ను చూపిస్తూ........
సింహం జూలు విదిల్చింది......”కబడ్డీ.... కబడ్డీ......” .....
“కబడ్డీ......” అంటూ వెళ్లి అందులో ఒకడిని గట్టిగా పట్టుకున్న.......
అందరు ఒక్కసారిగా నవ్వారు......ఎందుకో నాకర్ధం కాలేదు....ఇంతకు ముందు వాడు వెళ్ళినపుడు కూడా అంతేగా.......అందరు కలిసి ఒక్కడిని పట్టుకున్నారు...... ఇప్పుడు నేను ఒకన్ని పట్టుకున్నాను...... వీళ్ళకు అసలు ఆటే రాదు..
ఎలాగైతేనేం..... మా తరగతి వాళ్ళకి కబడ్డీ పోటీలు జరగలేదు.....మరుసటి రోజు......పరుగు పందేలు..
తరగతి మొత్తాన్ని పిలిచి.....దూరంగా ఇద్దరు లాగి పట్టుకున్న ఒక తాడును చూపిస్తూ ...”దాన్ని ఎవరైతే ముట్టుకొని....మల్లి ఈ చివరకు మొదట చేరుకుంటారో....వాళ్ళు గెలిచినట్టు.....ఈల వేసేదాక ఎవరూ పరిగెత్త కూడదు. ” అంటూ ముగించాడు.....
ఈల వేసాడు మాష్టారు.......అందరూ పరిగెత్తడం మొదలు పెట్టారు...కొందరు ఆ తాడు ముట్టుకోకుండానే మధ్యలోనే వెనక్కి పరిగెత్తారు..........అందరికి కంటే నేనే గొప్ప వాడిని ...అసలు నేను పరిగెట్టలేదు .....ఎలాగు ఇదే చివరకు కదా అందరూ రావాల్సింది అని.....

సంతాపం

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.... ఇది నా విషయంలో చాలా కరెక్ట్.
నా చిన్నప్పుడు చాలా సార్లు నా తెలివి తేటల్ని ప్రదర్శించాను.
ఒక సారి మా అమ్మ బియ్యం చెరుగుతుంది, దూరంగా ఒక తొండ అప్పుడే మా అమ్మ కత్తిరించి పెట్టిన కూరగాయల వైపు వెళ్తుంది... అది చూసి నన్ను పిలిచి....”అరేయ్ దాన్ని కొట్టు.....” అని ఆజ్ఞాపించింది.......
అంతే.....మాత్రువాఖ్య పరిపాలనా దక్షుడనై ఒక ఇనుప చువ్వను చేబూని......అమ్మ ఆజ్ఞని నెరవేర్చాలి అన్న ఆవేశంలో.... దాని తలపై ఒక్కటిచ్చా......
దాని తలా, మొండెం వేరైపోయాయ్......మొండెం దొరికింది... తల ఎక్కడో ఎగిరిపోయింది....
కొట్టడం అంటే దూరంగా తరమడం అని తెలియని నా అమాయకత్వానికి ఒక నిండు మూగ ప్రాణం బలైంది....
అందుకే అప్పుడు చేసిన పొరపాటుకి ఇప్పుడు ఈ బ్లాగు ముఖంగా సంతాపం తెలియజేస్తున్నాను.......
రెండు నిమిషాలు మౌనం..............

Jul 8, 2011

వేసవి కాలం

ఎండాకాలం వచ్చిందంటే ఎంత హాప్పి నో అసలు...అమ్మమ్మ వాళ్ళింటికెల్లొచ్చు...హాయిగ సత్తి మామ ఉంటాడు,అంబిక అక్క ఉంటుంది..బర్రెలు..కోళ్ళు..జామ చెట్టు. ఎంచక్క అడిగే వాళ్ళు ఉండరు, సూపరుగ ఆడుకోవచ్చు..సారీ!! మనం చాలా బద్దకస్తులం కదా..నొ ఆడుకోవడం.. ఒన్లీ పడుకోవడం.
పొద్దునే బర్రెల పేడ కంపు తొ ఉదయం... కాదు..సూర్యుడు ఉదయించక ముందే రోజు స్టార్ట్ అవుతుంది.
అప్పుడే బర్లు వాటి వాటి మల మూత్ర విసర్జన కార్యక్రమాలు స్టార్ట్ చెస్తాయ్.. సత్తి మామ లేచి పాలు పితకడం,అమ్మమ్మ,అంబికక్క హెల్ప్ చేయడం....ఇది రొజూ వారి పని. మామ 5:30 కల్లా గొదవరిఖని కి వెల్లిపొయేవాడు.కొంచెం తెల్లవారగానే..ఇల్లు ఊడ్వడం,అలకడం స్టార్ట్ అవుతుంది..లేచి ఇక్కడ మంచాలు అక్కడ వెస్కొని మళ్ళీ తొంగోవడం అంతె..7 కి బర్లని మేపడానికి తోలతారు.. మనం మాత్రం దున్నపోతుల 9 కి లేచి బద్దకంగా పళ్ళు తొమేసరికి..అమ్మమ్మ చాయ్ వేడి చేసి కోప్ లొ పోసి ఇచ్చేది.. మనం తాగిన గ్లాస్ ఎక్కడ కూర్చుంటె అక్కడె పెట్టేసి.. జామ చెట్టు ఎక్కేసె వాళ్ళం..
ఇక స్టార్ట్ మా తాత గోల... దింగండిరా!!!!! అని... మనం ఎందుకు దిగుతాం...నాతొ పాటు మన గాంగ్ చెల్లి,అక్క,అన్న,తమ్ముల్లు(పెద్దమ్మ వాల్ల పిల్లలతొ సహా).. సపరివారం అంతా.. లేచిన వాడు లేచినట్టు గా.. జామ చెట్టు ఎక్కేయడమె....బ్రేక్‌ఫాస్ట్ మొదలు అయ్యేది అక్కడే... మొహం మొత్తాక కిందికి దిగడం... ఈలొపు వంట-వార్పు కార్యక్రమాలు ఎమన్నా జరిగితే మళ్ళి ఒక రౌండ్ కుమ్మడం.. లేకుంటె తినమని అమ్మమ్మ,తాత దొబ్బే వాళ్ళు..ఎప్పుడు కడుపు కదిలితే అప్పుడు అలా కాల్వ గట్టుకు పోయి...పని ముగించేసి... అక్కడే కాసేపు టైంపాస్ చేసి.. వీలుంటె నీళ్ళలొ దిగి.. ఆడి.... అలసి పొయాక మద్యాన్నం నిద్ర కోసం ఇంటికి వచ్చె వాడిని..ఈలొపు మామ రిటర్న్ అవుతాడు.. అందరు మామ సైకిల్ దగ్గరికి పరుగో పరుగు..మామ గొదవరిఖని నుండి ఎమన్నా తెచ్చాడొ చూసి..ఉంటే కుమ్మేసి..పాల క్యాన్ లు కడగడం స్టార్ట్ చేస్తారు.. . బర్లను మేపడానికి పని వాడిని పెట్టుకోక ముందు మామ మేపడానికి వెళ్ళెవాడు... అప్పుడప్పుడు వాయిల్ కొమ్మలు విరిచుకొని మేము కూడ పొలోమని బయల్దేరెవాళ్ళం..నడవలేక పోతె నన్ను అన్నని చెరొక బర్రె మీద కుర్చోబెట్టె వాడు మా మమ.. ఆ ఎండకు బరించలేక  మద్యలోనె రిటర్న్ అయ్యే వాళ్ళం..మామ వచ్చేటప్పుడు ఈత కాయలు పట్టుకొచ్చే వాడు...మద్యాన్నం టీవి చూసే వాళ్ళం కాసేపు...ఒక సారి అది రిపేర్ కి వచ్చింది.. మా అన్న కి కాస్త రిపేరింగ్ లొ ప్రావిణ్యం ఉండటం చేత దాన్ని విప్పాడు.. తర్వాత తెల్సింది, మా అన్న కి బిగించడం రాదు అని.... దానితొ అప్పుడప్పుడు చూసే జంగిల్ బుక్, శక్తిమాన్ కి దూరం అయ్యాం... మాకో అక్షయ వృక్షం లాంటి నిమ్మ చెట్టు ఉండేది... ఎన్ని కాయలు తెంపినా ఇంకా చాలా ఉండేవి... ఊర్లొ అందరు వచ్చి తెంపుకు పొయే వాళ్ళు.. మేము మద్యాన్నం షర్బత్ చెస్కునే వాళ్ళం...షర్బత్ చెసెప్పుడు మాత్రం పార్టీలు పెట్టే వాళ్ళం...ఒక పార్టి వాళ్ళు నాలుగు నిమ్మ కాయలు కోస్తె మరో పార్టి వాళ్ళు అయిదు కోసేవారు.. చక్కర కొసం పొట్లాట జరిగేది.. మా మామ పాలు అమ్మితె వచ్చే సగం డబ్బులు చక్కరకె అయ్యెది..
అరుగు మీది గుమ్మి లొ కొడి గుడ్లు పెట్టేది...అది గుడ్డు పెట్టె అప్పుడు నానా రచ్చ సౌండ్ చెసేది... మాకు నిద్ర డిస్టర్బ్ అయ్యేది...
మా పిల్ల గ్యాంగ్ అంత ఒక సారి ఆస్థి పంపకాలు చేస్కున్నాం.. అందులొ మొదటిది జామ చెట్టు...
ఒక్కో కొమ్మ ఒక్కొక్కరం పంచుకున్నాం
మొదటి నిబందన... ఎవరూ ఇష్టం వచ్చినట్టు కాయలు కోయాకుడదు..
రెండవ నిబందన.. ఎవరి కొమ్మ కాయలు వాళ్ళె కొసుకొవాలి,వేరె కొమ్మల జొలికి వెళ్ళ కుడదు..వాళ్ళ కొమ్మకు కాయలు అయిపొయిన సరే...
మూడవ నిబందన...ఎవరైతె నిబందనలని అతిక్రమిస్తారొ వాళ్ళ కొమ్మల కాయల్ని ఎవరైన కొసుకోవచ్చు..
నాలుగవ నిబందన.. పందిరి వైపు వాలి ఉన్న కాయలు పబ్లిక్ ప్రాపర్టి....
చాల రొజులు ఈ నిబందనలు బాగనే వర్కౌట్ అయ్యాయ్...
ఆ కొమ్మల పైనే ఆటలాడడం.. మా కొమ్మల కాయలను పరస్పరం ఇచ్చి పుచ్చుకొవడం.. అబ్బబ్బ.. పూర్వం ఆది మానవులు చెట్ల మీద నివసించే వారు అంటే మాకు ఎ మాత్రం సందేహం రాక పోయేది...మేము ఆ కొమ్మల్లొ నిద్ర కూడా పోయె వాళ్ళం...
చక్కగా సాగుతున్న మా చెట్టు కాపురం లో విలన్లు కూడా ఉన్నారు....
విలన్1: చిలకలు
విలన్2: పచ్చ పాము(నాట్ డేంజరస్)
సాయంత్రం అవగానే చిలకలు మా చెట్టు మీద దాడి చేసెవి.. ఇష్టం వచినట్టు తినెసేవి..చాల వరకు కొరికి పడేసేవి..
ఇక పచ్చ పాము..దీనికి ఏం పని ఉండేది కాదు...ఊరంత బలాదూర్ తిరిగి ఎప్పుడు రెస్ట్ కావాలి అనుకుంటె అప్పుడు మా చెట్టు మీదికే వచ్చేది... అది వస్తుంది అని తెలిస్తేనె మాకు లాగులొ...
సర్రున కిందికి దిగి పోయెవాళ్ళం.. అది ఎప్పుడు వెళ్తుందా అని చూసి చూసి కళ్ళు జామ కాయలు కాసేవి...అది ఎంతకు వెళ్ళేది కాదు
విలన్3: కొన్ని రొజులకి చిలకల గోల ఎక్కువైంది.. కొన్ని కాయలు మాత్రమే కొరికి పెట్టెవి.. సరిగ్గా ఏ కాయ అయితె బాగుంటుందొ దాన్ని మాత్రమే కొరికి పెట్టేవి.. అది పండయ్యక తిందాం అన్న మా కొరిక బగ్నం చేసేవి.. ఇలా చాల సార్లు జరిగింది.. ఎ కాయైతె బాగుంటుందో..ఎ కాయైతె పండయ్యాక మేము తిందాం అని చూస్తమో కరెక్ట్ గా అదే కాయను కొరికేవి.. ఎంతకి అంతు పట్టని విషయం ఎంటంటె..కరెక్ట్ గా అవే కాయల్ని అవి ఎలా కొరికి పెదుతున్నాయి అని... ఎలాగైన ఈ మిస్టరీని చేదించాలి అనుకొని..ఒక స్పెషల్ టీం ని ఏర్పాటు చేసాం.... చాల రొజులు కృషి చేసి సాధించాం..
మా చెల్లి..మేము ఎక్కడ తినెస్తామో అని అది కాయగ ఉన్నప్పుడె కొరికి పెట్టేది...అదేంటొ మా చెల్లి లొని తెలివితేటలు అప్పుడే బయట పడ్డాయ్...అది అప్పుడే గుర్తించి కూడ ఇంక మేము తన డిప్లమాకి డబ్బులు కడుతూనె ఉన్నాం...తను ఎక్సాంస్ రాస్తూనె ఉంది..
సాయంత్రం అవగానే మళ్ళి బర్ల గోల స్టార్ట్ అవుతుంది.. అవి రాగానె దానా కోసం ఇంట్లొ చొరబడేవి...మా గ్యాంగ్ లొ ఇంటి ముందు గుమ్మానికి ఒకడు..వెనక గుమ్మానికి ఒకడు కాపలాగా ఉండేవాళ్ళం..ఇక మొదలు అవుతుంది అసలు స్టొరీ...నీళ్ళు చేదడం... వాటికి కుడిది పెట్టడం...అబ్బొ..! అవి కుడిది తాగుతుంటె వచ్చె సౌండ్..న భూతే న భవిష్యత్!!పాతాళం లోని గంగ ని అర్జునుడు లాగినప్పుడు కూడా అంత సౌండ్ రాలేదేమో..అలా ఒక్కొక్కటిగ అన్నింటిని కవర్ చెసేసి...కొంచెం చీకటి అవగానే మళ్ళీ పాలు పితకడం స్టార్ట్ చేస్తారు...
అప్పుడే పితికిన పాలల్లొ.. ఒక గ్లాసెడు చెక్కర వేసుకొని(కరక్టె.. మేము గ్లాసెడు పాలకి గ్లాసెడు చెక్కర వేసే వాళ్ళం) తాగేవాళ్ళం.
రాత్రి తినక ముందే అందరు నిద్ర మొఖాలు వేసేవాళ్ళు... ఎవడు ముందు డిన్నర్ కి వస్తే వాడికి కొడి గుడ్డు పళ్ళెం దక్కుతుంది.. దాన్ని అందరు స్పెషల్ గా బావించేవాళ్ళు ..తినేటప్పుడు దోమలతో అగచాట్లు...మేము అన్నం తింటుంటే అవి మమ్ముల్ని తినేవి...ఈ మధ్యలొ మాతొ పని లేదన్నట్టుగా.. మనం మార్నింగ్ టైం లో చేసే పనులన్నీ మా బర్రె రాజములు కానిస్తూ ఉండేవి.. ఆ సౌండ్ లేమి పట్టించుకోకుండ మా బొజనం మేము కానిచ్చేవాళ్ళం...మా జనాభా ఎక్కువ.. మంచాలు తక్కువ.. మళ్ళీ అదే తంతు.. ఎవడైతె ముందు నిద్రకు పోతాడొ వాడికి మంచం దొరుకుతుంది.
మా వాకిలి నిండా బర్రెలే కాబట్టి, సాయమ్మ వాళ్ళ వేప చెట్టు కింద పడుకునేది... చుక్కలు లెక్క పెడుతూ మేఘాల చాటుకు దాక్కున్న చంద్రున్ని చూస్తూ.. మా సత్తి మామ సుత్తి వింటూ...అలా నిద్ర లోకి జారుకునేది..
రొజులో అలా ఒక సారి పిన్ని వాళ్ళ చింత చెట్టు మీద కూడ దాడి చెసేవాళ్ళం...అక్కడైతె తాత ఉండడు.. ఓది మామ ఉండడు..మేము ఎంత అల్లరి చేసినా మా పిన్ని బిసి లొ పిన్ని ఉండేది.. ఇల్లెక్కి పెంకులు విరగొట్టె వాళ్ళం..ఇవి చాలక పక్క వాళ్ళ చింత కాయలు కూడ రాల గొట్టే వాళ్ళం.. పిన్ని వాళ్ళకో పెద్ద రేగు చెట్టు కూడా ఉండేది..కాయలు మాత్రం కాయక పోయేది...ఇలా మా రొజులు నిమిషాల్ల గడిచి పొయేవి....సెలవులు అయిపొయేవి.. అమ్మమ్మ వాల్లిల్లు వదిలి వెళ్ళాలంటె ఏడుపు వచ్చేది.. అప్పుడప్పుడు ఎడుస్తూనె వెళ్లే వాళ్ళం.. మళ్ళీ దసరా కి వచ్చేస్తాం కదా...

Jul 7, 2011

బొంబయ్ పప్పు!!

నేను: రేయ్! బజారుకు వెల్లి మైసూర్ పప్పు(ఎర్ర పప్పు) తీస్కు రా!
తమ్ముడు: సరె అన్నయ్య! ఎంత?
నేను: అర కిలొ!
**************************************************************************
తమ్ముడు: అన్న! అర కిలో బొంబయ్ పప్పు ఇవ్వవా?
షాపు వాదు: బొంబయ్ పప్పా??? ఎప్పుడు వినలేదే?
తమ్ముడు: బొంబయ్ పప్పు పేరు వినలేద? అసలు బొంబయ్ పప్పు లేకుండ ఎలా షాపు నడుపుతున్నావ్?
జనాలు బొంబయ్ పప్పు కొసం ఎగబడతారు తెలుసా? మా ఊర్లొ అన్ని షాపుల్లొను అమ్ముతారు?
షాపు వాడు: ఎమో సార్! మా దగ్గర లేదు!
తమ్ముడు: సరే పెసర పప్పు ఇవ్వు.
*************************************************************************
షాపు వాడు: సార్! అదెదో బొంబయ్ పప్పట, చాలా పాపులరట.. మీరు నాకెప్పుడు పంపలేదు ఎంటి?  
డీలర్: బొంబయ్ పప్పా!! నాకు తెలియదే? 
షాపు వాడు: అదెంటి సార్! అన్ని చొట్లా ఉంది, మన దగ్గరే లేదు... చాల మంది అడుగుతున్నారు... కొంచం తొందరగ తెప్పించండి సార్!  
************************************************************************
డీలర్ భార్య: వదిన! విన్నావ.. అదెదో బొంబయ్ పప్పట.. చాల బాగుంటుందట.. మనకసలు ఇన్ని రొజులు తెలియనే తెలియదు.. 
వదిన: ఆ.. నాకెందుకు తెలియదు లే! నా చిన్నప్పుదు రొజూ వాడె వాల్లము.. మా అమ్మ చాల సార్లు వండింది. కాని ఇప్పుడు దొరకట్లెదు అంతె.
డీలర్ భార్య: అవున వదినా! నాకసలు ఇన్ని రొజులు ఈ విషయం తెలియనే తెలియదు.
**********************************************************************************
(మంత్రివర్గ సమావేషం)
మినిస్టర్: ఎక్కడయ్య, బొంబయ్ పప్పు! కమిషన్ వేసి వారం రొజులు అయ్యింది.. కనీసం అది ఎక్కడ దొరుకుతుందొ కూడ కనిపెట్ట లేక పోయారు..జీతం తీస్కొగానే సరి పొదయ్యా పని చెయండి.          
పొలిస్:మేము చాలా ట్రై చేస్తున్నాం సార్! అదేదో అరుదైన పప్పు లా ఉంది, ఇదేదొ మాదక ద్రవ్యాల వ్యాపారం ల అండర్ వరల్ద్ డాన్ లు నడిపిస్తున్నట్టు ఉంది సార్!
మినిస్టర్: అదంత నాకు తెలియదయ్య! నాకు ఇంకొ రెండు రోజుల్లో బొంబయ్ పప్పు కావాలి అంతే.
 లేక పోతె మా అవిడ నాకు భోజనం పెట్టేల లెదు... వండితె బొంబయ్ పప్పు తోనె వండుతా అని మూడు రొజుల నుండి భీష్మించుకు కూర్చుంది..  
*************************************************************************************
(న్యూస్ చానెల్)
సుమతి! ఇక్కడ బొంబయ్ పప్పు కోసం జరుగుతున్న నిరాహార దీక్ష మూడో రొజుకు చేరుకుంది.. ఈ దీక్ష గురించి వల్ల మాటల్లొనె తెలుసుకుందాం...
ప్రజా: ఇన్ని రొజులు గవర్నమెంట్ బొంబయ్ పప్పు ని అంద్రకి రాకుండా అడ్డుకుంది..ఇకనైన ప్రబుత్వం రహస్య గొదాముల్లొ దాచిన బొంబయ్ పప్పు ని బయటకి తీసి సామన్య ప్రజలకి అందుబాటు లోకి తెచ్చె వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇకనైన ప్రబుత్వం స్పందించక పొతే మేము ఆత్మహత్యకు కూడా సిద్దమే!
*************************************************************************************
నేను: ఎంట్రా పెసర పప్పు తెచ్చావ్?
తమ్ముడు: వాడు బొంబయ్ పప్పు లెదన్నడు అన్న!
నేను: బొంబయ్ పప్పు ఎంటి రా? నేనుతెమ్మంది మైసూర్ పప్పు కదా?
తమ్ముడు: అందుకా! వాడు నన్ను అంత విచిత్రంగా చుసాడు...
నేను: చిన్నపటి నుండి హస్టల్ లో పెరిగితే ఇలానే ఉంటుంది..